ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెల
మంథని ఆంధ్రప్రభ బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా శనివారం కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో నిత్యం రద్దీగా ఉండే మంథని బస్టాండ్ ప్రయాణికులు లేక వెలవెలబోతుంది.
బీసీ బంద్ కు అన్ని పార్టీల వారి నాయకులు మద్దతు ఇవ్వడంతో సజావుగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.
నిత్యం ప్రజలతో బిజీగా కనిపించే మంథని చౌరస్తా, ప్రజలు లేక ఖాళీ రోడ్లతో దర్శనమిస్తుంది.


