బాసర ఆర్జీయూకేటీ వీసీకి సన్మానం

బాసర, (ఆంధ్రప్రభ) : బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్) వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వీసీ చాంబర్‌లో వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్‌ను గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ తరపున శాలువాతో సన్మానించి, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వీసీ గోవర్ధన్ మాట్లాడుతూ….. ప్రతి ఒక్కరి సహకారంతో యూనివర్సిటీని ముందుకు నడిపిస్తున్నానని అన్నారు. ప్రతి ఉద్యోగి తమకు కేటాయించిన విధులను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, యూనివర్సిటీ అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ యూనియన్ అధ్యక్షుడు ముత్యం, కృష్ణ, శ్రీధర్, వీణా, హారిక, సోనియా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply