గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు

గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు

ధర్మపురి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ధర్మపురిలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి పై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్మపురి పట్టణానికి చెందిన చొప్పరి పృధ్వీరాజ్(Choppari Prithviraj) నర్సయ్య పల్లెకు వెళ్లే మార్గంలో గంజాయి సరపరా చేస్తున్నారని పక్క సమాచారంతో ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్(Uday Kumar) తన సిబ్బందితో వెళ్లి పృథ్వీరాజును అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా అతని వద్ద 103 గ్రాముల గంజాయి లభించింది. పంచనామ నిర్వహించి అతని వద్ద నుంచి గంజాయిని, మొబైల్ ఫోన్ స్వాధీన పరచుకొని కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఎస్ఐ ఉదయ్ మాట్లాడుతూ.. ఎవరైనా వ్యక్తులు గంజాయి సరఫరా చేసినా, కలిగి ఉన్న అట్టి వ్యక్తులపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాలు సరఫరా చేసినా పోలీసులకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు

Leave a Reply