రెండు రోజుల్లో జీ.ఓ. విడుదల

రెండు రోజుల్లో జీ.ఓ. విడుదల

ధర్మపురి, ఆంధ్రప్రభ : “ధర్మపురి ప్రజల రుణం తీర్చుకుంటాను… ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాను” అని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ & వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధ‌ర్మపురి(Dharmapuri)కి త్వరలో డిగ్రీ కళాశాల, ధర్మపురి నియోజకవర్గంలో విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు రెండు రోజుల్లో జీ.ఓ. విడుదల అవుతుందని తెలిపారు.

గోదావరిలో మురుగునీరు చేరకుండా సేవరేజ్ ప్లాంట్(Sewerage Plant) ఏర్పాటుకు 17 కోట్లు అంచనా సిద్ధం చేసామని, త్వరలో నిధులు మంజూరు అవుతాయని తెలిపారు.

రైతులకు సౌకర్యాలు.. రోల్లవాగు పనులు పూర్తిచేస్తాం

రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్(Lift Irrigation Schemes), అక్కపెళ్లి రిజర్వాయర్ మెయింటెనెన్స్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతుందని చెప్పారు. రోల్లవాగు ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.

ధర్మపురిలో బస్ డిపో ఏర్పాటు ప్రణాళిక దశలో ఉందని తెలిపారు. నేరెళ్ల గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లు 1,200 మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు(Ration Card) కూడా మంజూరు చేయలేదని మంత్రి విమర్శించారు. “మీరు ఇచ్చిన హామీలపై చర్చకు సిద్ధం.. స్థలం మీరు నిర్ణయించండి” అని సవాలు విసిరారు.

ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా, సంక్షేమ పథకాలపై రాజీ పడబోమని, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలు ఇప్పటికే ప్రారంభించామని గుర్తుచేశారు.

ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి 6 కోట్లు(6 Crores) కేటాయించామని తెలిపారు. వేదపండితులను ధర్మపురికి రప్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వివరించారు. ఇటీవల చాగంటి కోటేశ్వరరావును ధర్మపురికి ఆహ్వానించి ప్రవచనాలు చేయించినట్లు చెప్పారు.

ధర్మపురి నియోజకవర్గంలో కనీసం రెండు రోజులు శాశ్వతంగా ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. “ప్రజలు నేరుగా నా వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు” అని అన్నారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంఘనబట్ల దినేష్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్(Jakku Ravinder), గొల్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు సంగా నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply