విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Veda Bojju Patel) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్(KB Complex) లో ఈ రోజు ఏర్పాటు చేసిన డివిజన్ స్తాయి గిరిజన క్రీడా ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ముందుగా రిబ్బెన్ కట్ చేసి, ఆర్చర్(Archer)తో బాణం వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యం ఈ క్రీడలతో వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి విద్యార్థి క్రీడల్లో గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయిలో క్రీడల్లో ఎదగాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్చతో బాణం వదిలిన అనంతరం అధికారులు, ఉద్యోగులు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు శాలువాతో సన్మానించారు. ఆదిలాబాద్ ఆర్టిఏ నెంబర్ దూట రాజేశ్వర్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జై వంతు రావు(Jai Vantu Rao), క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉత్తం జాదవ్(Uttam Jadhav), క్రీడల క్రీడల జిల్లా అధికారి పార్థసారథి, హేమంత్ జాదవ్, వీఈ టిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

