తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో షూటింగ్

తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో షూటింగ్

కొత్తూరు, ఆంధ్రప్రభ : ప్రముఖ దర్శకుడు యోగేష్ కేఎంసీ(Yogesh KMC) దర్శకత్వంలో కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌(railway station)లో గత రెండు రోజులుగా షూటింగు కొనసాగుతుంది. ఈ రోజు ఈ సందర్భంగా దర్శకుడు యోగేష్ కేఎంసీ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్‌తో తీస్తున్న చిత్రానికి ఇంకా పేరును ఖరారు చేయలేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ షూటింగ్‌(shooting)లో ప్రముఖ నటులు నాజర్, సంయుక్త మీనన్ నటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ నటి సంయుక్త మీనన్ గతంలో భీమ్లా నాయక్(Bhimla Naik), విరూపాక్ష, బింబిసారా చిత్రాలలో నటించినట్లు ఆయన వివరించారు. ఈ చిత్రం గత 15 రోజులుగా తెలంగాణ ప్రాంతంలో షూటింగు కొనసాగిందని రెండు రోజులుగా తిమ్మాపూర్ రైల్వేస్టేషన్(Timmapur Railway Station)లో షూటింగ్ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. షూటింగ్లో భాగంగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌ను జామై ఉస్మానియాగా పేరు మార్చి ప్రస్తుతం ఫైట్ సీన్లు(Fight scenes) కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనెల 18 వరకు షూటింగ్ జరుగుతుందన్నారు.

Leave a Reply