బాసరలో లెక్కిస్తున్న హుండీలు

బాసరలో లెక్కిస్తున్న హుండీలు
బాసర, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా బాసర (basara) శ్రీజ్ఞాన సరస్వతి దేవి హుండీ లెక్కింపు ప్రారంభమైంది. శారదీయ నవరాత్రులు అనంతరం లెక్కింపు ఈ రోజు ప్రారంభించారు. బహుశ సాయంత్రానికి ఎంత ఆదాయం వచ్చిందో తేలుతుంది.
అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ (Hundi) కానుకలను బాసర ఆలయంలోని సాధారణ అక్షరాభ్యాస మండపంలో ఆలయ ఈవో అంజనీదేవి, ఆలయ సిబ్బంది, పోలీసులు, హోంగార్డు, సమక్షంలో లెక్కింపు ప్రారంభించారు. లెక్కింపు లో స్వచ్ఛంద సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

