కల్తీ మద్యం వ్యవహారంపై మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్

కల్తీ మద్యం వ్యవహారంపై మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రం లో విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ మద్యం(Adulterated liquor) వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని మాజీ మంత్రి విడదల రజిని డిమాండ్(Demand) చేశారు. సోమవారం వైసీపీ ఆధ్వర్యంలో కల్తీ మద్యం గురించి నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొని నారా వారి సారా వద్దు, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీయవద్దు అని నినాదాలు చేశారు.

అనంతరం స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్(Prohibition and Excise) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ సీఐ వినయ్ కుమార్(Excise CI Vinay Kumar)కు రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు అంతేకాకుండా నకిలీ, కల్తీ మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీలో(YSR Party)ని అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply