ఆదివాసీల భారీ ర్యాలీ

ఆదివాసీల భారీ ర్యాలీ
- ఐటీడీఏ ఎదుట ఆందోళన
చింతూరు, ఏఎస్ఆర్ జిల్లా, (ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు, ఆదివాసీ జేఏసీ(JAC) ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో ఐటీడీఏ కార్యక్రమం జోరు వర్షంలో సాగుతోంది. ఈ సందర్బంగా సోమవారం చింతూరు మండల కేంద్రం ప్రధాన సెంటర్ నుండి ఆదివాసీలు, గిరిజన యువత భారీ సంఖ్యలో హాజరై భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు.
చింతూరు ప్రధాన సెంటర్ నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ర్యాలీ(Rally) చేపట్టి నినాదాలతో రహదారులు మారుమ్రోగాయి. ఈ ర్యాలీ ఐటీడీఏ కార్యాలయం వరకు సాగి ఐటీడీఏ(ITDA) ఎదుట ఆదివాసీలు, యువత ఆందోళనకు దిగారు. ఒకపక్క వర్షం మరో పక్క చల్లని వాతావరణం ఉన్నప్పటికీ కార్యక్రమం విజయవంతం అయింది.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ మూడు పునరుద్ధరించి మరో కొత్త జీవో తెస్తాను ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలని, ఏజెన్సీ(Agency) ప్రాంతంలో ఆదివాసీ నిరుద్యోగులకు100 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఛలో ఐటీడఏ(Chalo ITDA) కార్యక్రమం చేపట్టారు.
మన్యంలో గిరిజనులతో భర్తీ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయాలని, తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్(Tribal Advisor Council ద్వారా తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ బైలా ప్రకారం తక్షణమే ప్రత్యేక డిఎస్సి(DSC) ప్రకటించాలని, షెడ్యూల్డ్ ప్రాంత చట్టాలైన 1/59,1/70 చట్టం,పెసా చట్టం, 2013 పోలవరం భూ సేకరణ చట్టం మొదలైన చట్టాలు పట్టిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
