భారీగా మోహ‌రించిన పోలీసులు

భారీగా మోహ‌రించిన పోలీసులు

మంచిర్యాల ప్రతినిధి , ఆంధ్రప్రభ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ(SC, ST Atrocities) కేసు న‌మోదు కావ‌డంతో మనస్థాపంతో నిన్న‌ ఆత్మహత్య చేసుకున్న యేట మధుకర్ మృతదేహానికి ఎట్టకేలకు పోస్టుమార్టం పూర్తయింది. నిన్న నీల్వాయి అడ‌వుల్లో మ‌ధుక‌ర్(Madhukar) చెట్టుకు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందారు. ఈ స‌మాచారం అందుకున్న ఆయ‌న కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థులు ఆందోళ‌న చేప‌ట్టారు. రాత్రంతా అడ‌వుల్లోనే మృత‌దేహంతో వారు ఆందోళ‌న చేశారు.

మృతుడు కుటుంబ స‌భ్యుల‌ను, గ్రామ‌స్థుల‌ను పోలీసులు, అధికారులు(Officers) ఒప్పించి మృత‌దేహాన్ని ఈ రో్జు ఉదయాన చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. అనంత‌రం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా పోలీసు ఉన్నత అధికారులు భారీగా బలగాలని ఇక్కడ మొహరించారు. మృతుడు మధుకర్ కు తల్లిదండ్రులు భీమయ్య, రాజక్క(Bhimaiah, Rajakka).. భార్య స్వరూప, కుమారుడు రవి, కుమార్తె మౌనిక ఉన్నారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయారు.

పార్టీ నాయకుడు అకాల మృతికి బీజేపీ(BJP) అగ్ర నాయకులు స్పందించారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు(Palwai Harish Rao) సహా మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, బెల్లంపల్లి పార్టీ ఇంచార్జీ కొయ్యల ఏమోజీ నీల్వాయికి చేరుకున్నారు.

అదేవిధంగా పార్టీ పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు వెంకటేష్(Venkatesh నేత, పార్లమెంటు నియోజక వర్గ నేత గొమాస శ్రీనివాస్, చెన్నూరు నాయకులు దుర్గం అశోక్ తదితరులు నిల్వాయికి చేరుకొని మధుకర్ మృతదేహానికి నివాళులర్పించారు. మధుకర్ మృతికి కారుకులైన వారిని వారిపై క్రిమినల్ (Criminal) కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసేంతవరకు ఊరుకోబోమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ‘ఆంధ్రప్రభ’తో స్పష్టం చేశారు.

Leave a Reply