గుడిమల్లం ఆలయ హుండీ లెక్కింపు
ఏర్పేడు, ఆంధ్రప్రభ : ప్రసిద్ధిగాంచిన గుడిమల్లం ఆనందవల్లి సమేత పరుశురామేశ్వర స్వామి దేవస్థానం హుండీని శుక్రవారం లెక్కించారు. ఈ కార్యక్రమం తిరుపతి దేవాదాయ శాఖ డివిజన్ తనిఖీ అధికారి, పణిరాజ సేన, ఆలయ ఈవో కే రామచంద్రారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ బత్తలగిరి నాయుడు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ జయశంకర్, మహిళా పోలీస్, తానికొండ మణి బాబుల సమక్షంలో కానుకలను లెక్కించారు. 34 రోజులకు హుండీ ఆదాయం రూ. 2,20,902, అన్నదానం హుండీల ద్వారా రూ.24875ల వచ్చినది. మొత్తం రూ. 2,45,777 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కే.రామచంద్రారెడ్డి తెలిపారు.

