నిండుకుండ‌లా నాగార్జునసాగర్‌

నిండుకుండ‌లా నాగార్జునసాగర్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar)కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 26 గేట్లు (26 gates) ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. 2.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ( inflow) వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వెళ్తుంది. స్పిల్‌ వే ద్వారా 2.16 లక్షల క్యూసెక్కులు వెళ్తుండగా, ఎడమ కాల్వకు 8193 క్యూసెక్కులు, విద్యుత్‌ కేంద్రానికి 33,291 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకుగాను 305.68 టీఎంసీలుగా న‌మోదైంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు 2,63,370 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,70,754 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Leave a Reply