నాగావళి ప్రాంతంలో వరద పరిశీలన
( విజయనగరం, ఆంధ్ర ప్రభ): నాగావళి (Nagavali) పరీవాహక ప్రాంతంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వరద ముప్పు ప్రాంతాలను సందర్శించి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. రేగిడి మండలం బొడ్డవలస (Boddavalsa) గ్రామం వద్ద నాగావళి ఉధృతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.

