Nizamabad | పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్
నిజామాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి13: (ఆంధ్రప్రభ) బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ సమయాపా లన పాటిస్తూ పారిశుద్ధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. గురువారం తెల్లవారుజామున నగరం పాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లలో పారి శుద్ధ్య నిర్వహణ పను లను కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. చెత్త, చెదారం లేకుండా, మురుగునీటి కాలువల్లో ఎప్పటి కప్పుడు పూడికను తీస్తూ శుభ్రంగా ఉంచాలని సూచించారు.
కంటేశ్వర్, గొల్ హనుమాన్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్ధ్య సిబ్బందికి కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు