ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరాఖండ్‌ (Uttarakhand) రాష్ట్రంలో ప్రకృతి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం రాత్రి డెహ్రాడూన్ జిల్లా సహస్త్రధార ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్‌ (Cloudburst) సంభవించడంతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరద నీరు కాసేపటికే గ్రామాలపైకి చేరి బీభత్సం సృష్టించింది (Wreaks havoc). అకస్మాత్తుగా వచ్చిన వరదతో పలువురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

వరద స్రవంతిలో ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రహదారులపైకి మట్టి, చెట్లు, శిథిలాలు చేరడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రిషికేశ్‌ (Rishikesh) లో చంద్రభాగానది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. తమ్సా, టన్స్‌, సాంగ్‌ నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో తీరప్రాంతాల ప్రజల్లో భయం అలుముకుంది.

ఇక వరదలో చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు (SDRF teams) సురక్షితంగా బయటకు తీశాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రభావిత గ్రామాల్లో సహాయక చర్యలు (Assistive measures) చేపడుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు, వాతావరణ విభాగం సమాచారం ప్రకారం, రాబోయే 24 గంటలపాటు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply