ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

పాడేరు, (ఏఎస్ఆర్ జిల్లా ) : ఏజెన్సీ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు. గోదావరి, శబరి నీటి ఉదృతి అధికంగా ఉన్న దృష్ట్యా చెపడుతున్న ముందస్తు చర్యలపై ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్, రంపచోడవరం, చింతూరు ప్రాజెక్ట్ అధికారులు, జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు, తహసీల్దార్, ఎంపిడిఓలతో బుధవారం జిల్లా కలెక్టర్ టేలికాన్ఫరెన్స్ నిర్వహించ్చారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ముందుగా ముంపుకు గురైయ్యే మండలలైన రంపచోడవరం, చింతూరు, విఆర్ పురం మండల తహసీల్దార్లతో ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. మందులు అందుబాటులో ఉండాలన్నారు.

అవసరమైనచోట్ల లోతట్టు ప్రాంత ప్రజలను ముఖ్యంగా గర్భవతులు, పాలిచ్చు తల్లులు, చిన్నారులు, వృద్ధులను, వైద్య సహాయం అత్యవసరంగా కావలసినవారిని ప్రత్యేక శ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కావలసిన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలని, కావలసిన జనరేటర్లు, త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దండోరా వేసి ప్రజలకు అప్రమత్తం చేయాలన్నారు. నిత్యావసర సరుకుల పంపిణి పై ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.

ఎక్కడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు అప్రమత్తం అవసరమన్నారు. కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే టార్పాలిన్స్ అవసరం అయిన వారికి అందించాలన్నారు. విద్యుత్ అంతరాయం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.

ఈ టెలికాన్ఫెరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ, రంపచోడవరం, చింతూరు ప్రాజెక్ట్ అధికారులు కె. సింహాచలం, శుభం నోఖ్వాల్, చింతూరు అదనపు పంకజ్ కుమార్ మీనా, వివిధ శాఖల అధికారులు సంబంధిత మండలాల ఎంపిడిఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Leave a Reply