Stumps | Day 4 : ఇంగ్లాండ్ తో జ‌రుగుతున్న కీల‌క నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (87), కేఎల్ రాహుల్ (78) కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 0 ప‌రుగుల‌కే టీమిండియా రెండు వికెట్లు కోల్పోగా.. గిల్-రాహుల్ దీటుగా బ్యాటింగ్ చేస్తూ రికార్డు భాగస్వామ్యం నెల‌కొప్పారు.

దాదాపు 62 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచి 174 పరుగుల అజేయ మూడో వికెట్ భాగస్వామ్యం అందించి భారత్‌ను మ్యాచ్‌లో తిరిగి నిలిపారు. అయితే, మ్యాచ్ ఇంకా ఇంగ్లండ్ ఆధిపత్యంలోనే ఉంది. భారత్ ఇప్పటికీ 137 పరుగుల వెనుకంజలో ఉంది.

ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. రేపు మ్యాచ్ లో భార‌త్ ఏదైనా మ్యాజిక్ చేసి ఈ నాలుగో టెస్ట్‌లో విజయం సాధిస్తే.. సిరీస్‌ను సమం చేయగలదు. లేదంటే ఇంగ్లండ్ సిరీస్‌ను ఖాతాలో వేసుకుంటుంది. ఈ నేప‌థ్యంలో మాంచెస్టర్‌లో నేడు జరగనున్న డే 5 – అసలైన టెస్ట్ క్రికెట్ థ్రిల్లర్ను అందించనుంది.

Leave a Reply