SPL Trains | తిరుమ‌ల వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఆ రైలు సేవ‌లు పొడ‌గింపు !

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు సౌత్ సెంట్రల్ రైల్వే శుభవార్త అందించింది. చెర్లపల్లి నుండి తిరుపతికి (Cherlapalli to Tirupati) నడిచే ప్రత్యేక రైలు (07017/07018)ను మరో నెల రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది.

తొలుత ఈ రైలు సర్వీసులు (Special trains) జూలై చివరి వరకు మాత్రమే నడపాలని భావించిన రైల్వే అధికారులు, భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకుని ఈ ప్ర‌త్యేక రైలు సేవ‌ల‌ను ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించారు.

ఈ అవకాశాన్ని భక్తులు పూర్తిగా ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చర్లపల్లి-తిరుపతి రైలు తెలంగాణలోని మల్కాజిగిరి, కాచిగూడ, ఉమ్డానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్ స్టేషన్లలో ఆగుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్ సిటీ, డోన్, గూటీ, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లు కూడా ఈ రైలు సర్వీస్‌లో ఉండనున్నాయి.

తిరుమల దర్శనం కోసం వెళ్ళే ప్రయాణికులకు ఇది ఒక అదనపు సౌకర్యం కానుంది.

Leave a Reply