శ్రీకాకుళం జిల్లా (Srikakulam District ) ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట (faridpet ) గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉప సర్పంచ్ (depury surpanch ) సత్తారు గోపి (sattaru gopi ) దారుణ హత్యకు (brutal murder ) గురయ్యారు. . కోయిరాల జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కొందరు గోపిపై నేడు రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తల, మెడపై తీవ్ర గాయాలు కావడంతో గోపి అక్కడిక్కడే మృతి చెందాడు.
దీంతె సత్తారు గోపి దారుణ హత్య నేపథ్యంలో జాతీయ రహదారిపై బంధువుల ఆందోళనకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సత్తారు గోపి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..