Mulugu | గోదావరికి జలకళ..

  • ఉధృతంగా పెరుగుతున్న గోదావరి
  • పేరూరు వద్ద 14 మీటర్లకు చేరుకున్న నీటిమట్టం


వాజేడు, జులై 10 (ఆంధ్రప్రభ) : తెలంగాణ – ఛ‌త్తీస్ గ‌ఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ములుగు జిల్లా (Mulugu District) వాజేడు మండలంలో గోదావరి ఉధృతంగా పెరుగుతుంది. గోదావరిలోకి అత్యధికంగా చేరడంతో గోదావరికి జలకళ‌వచ్చింది. ములుగు జిల్లా వాజేడు (Vajedu) మండల పరిధిలోని పేరూరు గ్రామంలో గోదావరి క్రమేపి పెరుగుతూ సాయంత్రం సమయానికి 14 మీటర్లకు చేరుకుంది.

మరింతగా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యుసి అధికారులు తెలిపారు. దీంతో పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి (Godavari) ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, వంకలు నిండుగా వరద నీటితో ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే మత్స్యశాఖ (Fisheries Department) వారు కూడా గోదావరిలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేశారు. గోదావరి ఉధృతి మరింతగా పెరిగే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరు గోదావరిలోకి వెళ్ళొద్దని హెచ్చరించారు. గోదావరి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. అదేవిధంగా గోదావరి లోతట్టు ప్రాంతాలను ఎంపీడీవో శ్రీకాంత్ పరిశీలించారు.

Leave a Reply