AP | సీఎంతో సినీ ప్రముఖుల సమావేశం వాయిదా !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలవాల్సిన సమావేశం వాయిదా పడింది. మొదటగా నిర్ణయించిన ప్రకారం ఈ భేటీ రేపు (జూన్ 15వ తేదీ ఆదివారం) సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి వద్ద సీఎం నివాసంలో జరగాల్సి ఉంది.

అయితే, ఈ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పలువురు సినీ ప్రముఖులు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణలతో బిజీగా ఉండటం, అలాగే మరికొందరు ముఖ్యమైన అతిథులు అందుబాటులో లేకపోవడం వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తదుపరి సమావేశ తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *