KNL | మన ఆరోగ్యం కోస‌మే యోగా : కమిషనర్ రవీంద్రబాబు

కర్నూలు బ్యూరో, జూన్ 12, ఆంధ్రప్రభ : యోగా కార్యక్రమం మన ఆరోగ్యం కోసమేనని, దీనిని అందరూ అలవాటు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు (Commissioner Ravindra Babu) ప్రజలను కోరారు. గురువారం ఉదయం కర్నూలు పట్టణంలో పర్యాటక ప్రదేశం, చారిత్రాత్మక కట్టడమైన కొండారెడ్డి బురుజు దగ్గర చేపట్టిన యోగా కార్యక్రమంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ… మే 21 నుండి జూన్ 21 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగా పర్యాటక ప్రదేశమైన కొండారెడ్డి బురుజు (Kondareddy Buruju) వద్ద ఈరోజు యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు.

ఈనెల 17న‌ అవుట్ డోర్ స్టేడియంలో జిల్లాలోని మున్సిపల్ కార్మికులతో, స్థానికులతో కలిసి 5,000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, దానిని కూడా ఈరోజు లాగా విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈసందర్భంగా సీఈవో సెట్కూర్ (CEO Setkur) వేణుగోపాల్, ఎన్సిసి కమాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ… ఇందులో సహకరించిన అందరికీ, పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి (CEO Nasara Reddy), సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డిఎస్ఓ రాజా రఘువీర్, డిఎస్పి రాఘవేంద్ర ఆచారి, జిల్లా టూరిజం అధికారి విజయ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగ శివలీల, ఎన్సిసి కమాండెంట్ ప్రసాద్, రాష్ట్ర యోగ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అవినాష్, జిల్లా ఆయుష్ అధికారులు డా.శ్రీనివాసులు, డాక్టర్ ప్రసాద్, కార్పొరేటర్ లు కైప పద్మలతా రెడ్డి, నిలోఫర్, ఎన్ సిసి విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు.

Leave a Reply