ADB | తుఫాన్ బాధితులకు వెడమ ఫౌండేషన్ సాయం

ఎమ్మెల్యే ఆదేశానుసారం బాధితులకు నిత్యవసర వస్తువుల సరఫరా


ఆంధ్రప్రభ, ఇంద్రవెల్లి : శుక్రవారం రాత్రి తుఫాన్ గాలి వర్షానికి గ్రామానికి చెందిన 8మంది గృహాలపై కప్పు కోల్పోయి, నిత్యావ‌స‌ర వ‌స్తువులు త‌డిసి ముద్దయినందుకు మానవ సేవనే మాధవ సేవగా భావించిన వెడమ ఫౌండేషన్ ఎస్ కే గ్రూప్ చైర్మన్ జె కృష్ణ నిత్యావ‌సర వస్తువులు అందించారు. సోమవారం మండలంలోని ధర్మసాగర్ గ్రామంలో ఆయనతో పాటు ఖైతీ లాబానా గురువగు రామసింగ్ మహారాజ్ చేతుల మీదుగా ఈ నిత్యావ‌సర వస్తువులను అందించారు.

ఈ తుఫాన్ బీభత్సంలో కోల్పోయిన బాధితుల్లో సాబ్లె జైత్రం, సాబ్లే లాలు, ధోతి సైనా బాయి, గోతి సర్దార్ తోపాటు పలువురికి నిత్యావసర వ‌స్తువులు, ఆర్థిక సాయం అందించారు. అనంతరం జె.కృష్ణ మాట్లాడుతూ.. ఇండ్లు కోల్పోయిన వారికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఆధ్వర్యంలో ఇందిర‌మ్మ ఇండ్లను నిర్మించడానికి ప్రయత్నిస్తానన్నారు. అలాగే సాబ్లే జైత్రం వికలాంగుడుగా ఉండి ఇల్లు, తినుబండారాలు కోల్పోయినందులకు, ఆయన దినచర్య ఆటోతో రోజువారి కూలీ సంపాదన కోల్పోయినందులకు ఫైనాన్స్ వారు ఆయన ఆటోను తీసుకువెళ్లడంతో వారిని సంప్రదించి ఆ ఆటోను ఇప్పిస్తానన్నారు. ఈసందర్భంగా గ్రామ పెద్దలు, మాజీ ఉపసర్పంచ్ శ్యామ్ రావు, సాబ్లె సర్దార్, జ్ఞానేశ్వర్ (న్యాను ) కేంద్రీ, డాకురే శత్రుఘన్, జాదో రమేష్, మేడే వార్ అది నాథ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply