సెమీఫైనల్స్‌లోకి నిజామాబాద్ జిల్లా జట్టు

సెమీఫైనల్స్‌లోకి నిజామాబాద్ జిల్లా జట్టు

  • 109 పరుగుల భారీ విజయం
  • బౌలింగ్ లో లలిత్ రెడ్డి 5 వికెట్లు
  • బ్యాటింగ్ లో విక్రాంత్ రెడ్డి 69(33)

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : బి డివిజన్ టీ-20 లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా క్రికెట్ జట్టు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. గురువారం స్కై పార్క్-2 మైదానంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కాన్‌కార్డ్ జట్టుపై 109 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తన సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

విక్రాంత్ రెడ్డి 69 పరుగులతో జట్టుకు అద్భుత ఆరంభాన్ని అందించగా, విక్రమ్ నాయక్ 33, వర్షిత్ రెడ్డి 31, రయ్యాన్ బిన్ అబ్దుల్లా 31 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 219 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కాన్‌కార్డ్ జట్టు నిజామాబాద్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌ను ఎదుర్కోలేక 18.3 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. దీంతో నిజామాబాద్ జట్టు 109 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

బౌలింగ్ విభాగంలో లలిత్ రెడ్డి అద్భుతంగా రాణించి 3.3 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షంగా మలిచాడు. మనోహర్ 2 వికెట్లు సాధించగా, విక్రమ్ నాయక్, రయ్యాన్ బిన్ అబ్దుల్లా తలో వికెట్ తీసుకుని జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఈ విజయంతో నిజామాబాద్ జిల్లా జట్టు టోర్నమెంట్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. జట్టు ఆటగాళ్ల ప్రతిభపై హర్షం వ్యక్తం చేసిన నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం. వెంకట్ రెడ్డి, కోశాధికారి కె. శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రటరీ కమ్ కోచ్ ఎ. సురేష్ బాబు ఆటగాళ్లను అభినందించారు. సెమీఫైనల్ మ్యాచ్‌లో కూడా ఇదే జోరు కొనసాగించి ఫైనల్‌కు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply