19kg | కేంద్ర నిర్ణయంతో సామాన్యుడిపై భారీ భారం

19kg | కేంద్ర నిర్ణయంతో సామాన్యుడిపై భారీ భారం

19kg |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సామాన్యులు, చిన్న వ్యాపారులపై పెను భారం పడుతుందని విమర్శించారు.

19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.993 పెంచడం దుర్మార్గమని మంత్రి మండిపడ్డారు. ఈ నిర్ణయం టీ స్టాళ్లు, హోటళ్లు, చిన్న వ్యాపారాలు నిర్వహించే వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకురావడం ప్రజలను మోసం చేయడమేనని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒకలా, తర్వాత మరోలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ధరల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారాలు మోపకుండా కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

Leave a Reply