4 matches | వీకెండ్‌లో డబుల్ హెడ‌ర్‌

4 matches | వీకెండ్‌లో డబుల్ హెడ‌ర్‌

4 matches | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఈ రోజు ఆదివారం కావ‌డంతో ఐపీఎల్ ఫ్యాన్స్‌కి పండ‌గే పండ‌గ‌. ఇవాళ రెండు ఆస‌క్తిక‌ర‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతుండగా.. ఇకానా స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంట‌ల‌కు జరిగే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొన‌నున్నాయి. ఈ మ్యాచుల‌ లైవ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.

ఫామ్‌లోకి వచ్చిన సీఎస్కే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హోం గ్రౌండ్‌లో ఈ రోజు జ‌రిగే మ్యాచులో విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో దూసుకెళ్లాలని చూస్తోంది. ఇక వరుస ఓటములతో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచులో గెలిచి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. సీఎస్కే 4, గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌లలో విజయం సాధించి స‌మఉజ్జీలుగా ఉన్నాయి. పాయింట్ల పట్టికలో సీఎస్కే ఐదో స్థానంలో కొనసాగుతుండగా, గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉంది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో లక్నో – కోల్‌కతా మధ్య ఏడు మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా లక్నో ఐదు గెలవగా, కోల్‌కతా కేవలం రెండు మ్యాచ్‌లలోనే విజయం సాధించింది. ఈ ఏడాది ఇరు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగ్గా అందులో లక్నో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది.