సారపాకలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

ఖమ్మం, ఆంధ్రప్రభ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని వాసవి ఫంక్షన్ హాల్లో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు.
బూర్గంపాడు మండలానికి చెందిన అంగన్వాడీ టీచర్లకు ఈ స్మార్ట్ఫోన్లు అందజేయడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
