కరెంటు షాక్ తగిలి మహిళ మృతి

కరెంటు షాక్ తగిలి మహిళ మృతి
కడెం, ఆంధ్రప్రభ : కూలర్లో నీళ్లు పోస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన సంఘటన కడెం మండలంలోని మద్ది పడగలో చోటుచేసుకుంది. మండలంలోని మద్దిపడగ గ్రామానికి చెందిన కారం సుశీల (50) తమ ఇంట్లో గురువారం కూలర్లో నీళ్లు పోస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. సుశీలను కాపాడబోయిన తన తండ్రి అబ్రహంకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.
వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారున. మృతి చెందిన కారం సుశీల పది సంవత్సరాల క్రితం మద్దిపడగ గ్రామ ఉప సర్పంచ్ గా కొనసాగారు. మృతురాలు సుశీలకు ఇద్దరు కుమారులు కలరు. కడెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
