జిల్లా ఫస్ట్ సాధించిన విద్యార్థిని..

జిల్లా ఫస్ట్ సాధించిన విద్యార్థిని..
దర్శి, ఆంధ్రప్రభ : బుధవారం విడుదలైన ఇంటర్మీడియట్ జూనియర్ ఫలితాల్లో దర్శి ఏపీ మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థిని ఎస్కే బాజీ బేబీ అద్భుత ప్రతిభ కనబరిచింది.ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
ఆమె సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కష్టపడి చదివితే ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఆమె నిరూపించిందని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హసీనా బేగం తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
