చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై…

చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్సై…

జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాల్లో ప్రజలు ముందుండాలన్నారు. భవిష్యత్తులో పోలీసుల, ప్రజల సహకారంతో పేదలకు మరిన్ని ఉపయోగకరమైన సేవా పనులు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయకుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ ఫసిహుల్ల, స్థానిక సర్పంచి జక్కు సుష్మ- భూమేష్, ఉప సర్పంచి అప్పాల జలపతి, కార్యదర్శి ఆర్.రాహుల్ పద్మశాలి సంఘం మండలాధ్యక్షుడు సి.హెచ్ గంగయ్య, పొనకల్ పట్టణ అధ్యక్షుడు చెటుపల్లి కృష్ణ, ఉపాధ్యక్షుడు కందుల రమేష్, గౌరవ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సంబారి అంజన్న, ప్రధాన కార్యదర్శి అయ్యోరు శ్రీనివాస్, కోశాధికారి రాజమౌళి, ప్రచార కార్యదర్శి దూస రాము, నేతలు బాలిన రాము, నడిమెట్ల నరేందర్, పోతు వేణు, శ్రీనివాస్, బుచ్చయ్య, సత్యం, రంజిత్, రమేష్,లచ్చన్న, బుచన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply