స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి

స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి
- జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్
జైనూర్, ఆంధ్రప్రభ ; వైద్యాధికారులు వైద్య ఉద్యోగులు స్థానికంగా ఉండి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ వైద్య ఉద్యోగుల కోరారు. ఆయన శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న రోగులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు.
వైద్యాధికారులు వైద్య ఉద్యోగులు ఈ వేసవిలో వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వైద్య సేవల పట్ల, విధుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సర్పంచ్ కొడప ప్రకాష్ వైద్య ఉద్యోగులకు కోరారు. ఆసుపత్రిలో మందుల కొరత ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తేవాలని సర్పంచ్ కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, జిల్లా వైద్యాధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు.
