పేకాట గ్యాంగ్‌పై టాస్క్ ఫోర్స్ దాడి..

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏ.ఆర్.పి క్యాంప్ శివారు ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. నిజామాబాద్ సీసీఎస్ ఇన్‌చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఇద్దరు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు బుధవారం రాత్రి పోలీసులు తెలిపారు. దాడి సమయంలో రెండు సెల్‌ఫోన్లు, రూ.30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Leave a Reply