Sudden | కార్యాలయం, ఇళ్లల్లో తనిఖీలు..

Sudden | కార్యాలయం, ఇళ్లల్లో తనిఖీలు..
Sudden | ఆంధ్రప్రభ, వెబె డెస్క్ : వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాఖ అధికారులు అకస్మిక తనిఖీలను చేసి, అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తేల్చారు.
గురువారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు చేసిన అధికారులు, శుక్రవారం వివిధ సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో తనిఖీ సమయంలో ఇరవై మంది దళారులను పట్టుకున్నారు. వారి నుంచి లెక్కలలో లేని నగదు స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ల ఖాతాలకు చరవాణి ద్వారా బదిలీ అయిన డబ్బులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇరు-చరవాణి సందేశాల ఆధారంగా భారీ అవినీతి బాగోతం బయటపడింది. అధికారుల నివాసాల్లో సోదాల్లో ఇరవై నాలుగు లక్షల నగదు, భారీగా బంగారం, వెండి పట్టుకున్నారు. ముప్పై లక్షల విలువైన పొదుపు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వానికి దర్యాప్తు అధికారుల సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
