Longford | బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి

Longford | బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌ అనుమానాస్పద మృతి

Longford | హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఐపీఎల్‌ 2026 ఎంతో ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 76 ఏళ్ల జాన్‌ విలియమ్‌ లాంగ్‌ఫోర్డ్‌ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ముంబైలోని ఓ హోటల్‌ గదిలో జాన్‌ విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మార్చి 29న వాంఖడే స్టేడియంలో ముంబై-కోల్‌కతా మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌ ముగిసిన తర్వాత జాన్‌ తను బసచేస్తున్న ముంబైలోని ట్రైడెంట్‌ హోటల్‌ గదికి వెళ్లి పడుకున్నాడు.

మరుసటి రోజు 30న హోటల్‌ రిసెప్షన్‌ సిబ్బంది ఆయనకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసిన జాన్‌ స్పందించలేదు. దీంతో హోటల్‌ సిబ్బంది ఎమర్జెన్సీ కీతో గదిని తెరిచి చూడగా.. జాన్‌ విలియమ్‌ కింద పడిపోయి ఉన్నాడు. వెంటనే డాక్టర్లను పిలిచి పరీక్షంచగా.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు విచారాణ చేపట్టారు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్టులో మాత్రం ఎలాంటి అనుమానాస్పద అంశాలు లభించాలేదని సమాచారం.

Leave a Reply