90 days | ఆ తర్వాతే సినిమా రిలీజ్ కండీషన్ పెట్టాలి…

90 days | ఆ తర్వాతే సినిమా రిలీజ్ కండీషన్ పెట్టాలి…
90 days | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమా రిలీజ్ కండీషన్ పెట్టాలన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకపోతే యాక్టర్లు డ్రగ్స్ తీసుకున్నట్లేనన్నారు. అత్యధికంగా డ్రగ్స్ యాక్టివిటీ జరిగేది సినిమా ఇండస్ట్రీలోనే అన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, జనాలే అనుకుంటున్నారన్నారు. అందుకే యాక్టర్లు డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలని చెప్పానన్నారు. ప్రతి హీరోకు ఫ్యాన్ బేస్ ఉంటుందన్నారు. పవన్ ఆరు జేబుల ప్యాంట్ వేసుకుంటే ఫ్యాన్స్ కూడా అదే వేస్తారన్నారు.
చిరంజీవి స్టెప్ వేస్తే ఫ్యాన్స్ కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేస్తారన్నారు. నాయకులు చెప్పేదానికంటే యాక్టర్లు చెప్పేది జనాల్లోకి త్వరగా వెళ్తుందన్నారు. సినిమా యాక్టర్లందరూ 90రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. యాక్టర్లు డ్రగ్స్ తీసుకోలేదని తేలితే ఫ్యాన్స్ కూడా దూరంగా ఉంటారన్నారు. ఖుషీ సినిమాలో సారా ప్యాకెట్లను పవన్ పట్టుకోలేదా..? బాలకృష్ణ ఎక్ పెగ్ లా అంటే తప్పుకాదు.. ఎమ్మెల్యే టేబుల్ పై గ్లాస్ ఉంటే విమర్శలు చేస్తారన్నారు. ఎవరినీ తప్పు పట్టడం లేదన్నారు.
