మేడ్చల్‌లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్లో సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కలిసి దహనం చేశారు.. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, చెప్పని యెడల పాడి కౌశిక్ రెడ్డి పిచ్చోడనీ సమాజం వెలివేయాలని ఇలాంటి పిచ్చోడిని ఎక్కడ తిరిగిన చెప్పులతో భౌతికంగా దాడులు చేస్తాము అని హెచ్చరించారు.
ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని రాష్ట్రంలో కౌశిక్ రెడ్డి ఎక్కడ కనిపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు చెప్పులతో స్వాగతం పలకాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శివ శంకర్ ముదిరాజు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులు గువ్వ రవి ముదిరాజ్,మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగంటి మహేష్ కుమార్,మేడ్చల్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఉదండపురం సత్యనారాయణ,మాజీ కౌన్సిలర్స్ నడికొప్పు నాగరాజు (చాప రాజు) ముదిరాజ్,జాకట దేవరాజు,కౌడే మహేష్ కురుమ,నడికొప్పు బాల మల్లేష్ ముదిరాజ్,రామన్న గారి రాఘవేందర్ గౌడ్,రామన్న గారి సంతోష్ గౌడ్ ,మోహన్ ముదిరాజ్,గర్దస్ నరేందర్,మహిళా అధ్యక్షురాలు ప్రేమలత ,నడికోప్పు రంజిత్ ముదిరాజ్,దుబ్బ రామస్వామి ముదిరాజ్,నవీన్,యూత్ కంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి,nsui అధ్యక్షులు గుండా శ్రీధర్ కురుమ, మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షులు మహమ్మద్ ఆరీఫ్,మహిళా కాంగ్రెస్ నాయకురాలు వినోద,మల్లిశ్వరి,రేణుక,చిన్న రేణుక,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువకులు,మహిళలు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
