రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్

రాజన్న నిదర్శించుకున్న మంత్రి, విప్

వేములవాడ ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లు దర్శించుకున్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని భీమేశ్వరాలయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రి, విప్ కు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు అనంతరం తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భీమేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. యావత్ దేశ వ్యాప్తంగా రాములోరి పెళ్లి అంటే లోక కల్యాణం కోసం సర్వేజనా సుఖినోభవంతు అని వేడుకగా జరిగే కళ్యాణ ఉత్సవాలని, శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని,ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని ఆ భగవంతుడిని వేడుకున్నామన్నారు.

Leave a Reply