పాక్షికంగా నేలకి ఒరిగిన మొక్కజొన్న పంటను కాపాడుకోవాలి…

పాక్షికంగా నేలకి ఒరిగిన మొక్కజొన్న పంటను కాపాడుకోవాలి…
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : ఈనెల 18వ తేదీ నాడు వాతావరణంలో మార్పు వచ్చి వీచిన గాలితో పాటు తేలికపాటి వర్షానికి విస్సన్నపేట మండలంలో కలగర కొర్లమండ గ్రామాలలో చేతికి వచ్చిన మొక్కజొన్న పైరు కిందపడిన పరిస్థితులను పరిశీలించి న్నట్లు శనివారం ఏ డి ఏ కే శశికళ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ఆరుగాలం మొక్కజొన్న పంటను పండించుకుని సుమారు వారం పది రోజుల్లో కోతకు వచ్చి సిద్ధంగా ఉన్న మొక్కజొన్న పంటలు ఈనెల 18వ తేదీన కురిసిన అకాల వర్షానికి ఈదురు గాలులకు పాక్షికంగా నేల ఒరిగిన మొక్కజొన్న కర్ర మొదట్లో మట్టిని పైకి ఎగవేసి కర్రలు నిలబెట్టాలని రైతులకు అవగాహన కల్పించారు.
మొక్కజొన్న గింజ తయారవ్వడానికి మల్టీకే ఎరువులను ఎకరానికి 200 గ్రాములు చొప్పున పిచికారి చేసుకోవాలని పూర్తిగా నేలకొరిగిన 33శాతం కన్నా ఎక్కువ నష్టం వాటిలోని పొలాల్లో పంట నష్టం నమోదు ప్రక్రియను ఆయా గ్రామాలలో వీఏఏ, వీహెచ్ఈఎల్ ద్వారా పంట నష్టం నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు.

కావున రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న పంట నష్టం వాటిలినట్లయితే గ్రామాలలో పంట నమోదు చేస్తున్న అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని ఆమె అన్నారు. పంట నష్టం కింద నమోదు చేసిన మొత్తాన్ని జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల వారికి అందజేస్తామని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది జి ఉషారాణి రైతులు కవులూరి రాజా తదితరులు పాల్గొన్నారు.
