Avinash Reddy | ముప్పిడి అవినాశ్‌రెడ్డికి రెగ్యులర్ బెయిల్

Avinash Reddy | ముప్పిడి అవినాశ్‌రెడ్డికి రెగ్యులర్ బెయిల్
Avinash Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాశ్‌రెడ్డి లొంగిపోయిన తర్వాత సుప్రీంకోర్టు అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు కస్టడీ పూర్తయిన నేపథ్యంలో, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం సానుకూల పరిణామంగా భావిస్తున్నామని న్యాయవాదులు తెలిపారు. కాగా, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, బెయిల్ నిబంధనలు తర్వాతి ట్రయల్ కోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.
