రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న మురుగునీరు..

రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న మురుగునీరు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కమలానగర్ సాకిత్ నగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ తరుపున గెలుపొందిన విజయలక్ష్మి విజయకుమార్ పార్టీని వీడి అధికార పార్టీకు వెళ్లగా సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఉన్న లాలాగూడ వద్ద ఎల్ఐసి కార్యాలయం ముందు డ్రైనేజీ పొంగిపొర్లుతున్నా పట్టించుకోవడం లేదు.
గత 15 రోజులుగా ఈ డ్రైనేజీ పూర్తిగా పొంగిపొర్లుతుండడంతో ఆ ప్రాంతవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు పై ప్రవహించిన డ్రైనేజీ నీరుతో పాటు పక్కన ఉన్న ఇండ్లలోకి సైతం ఈ డ్రైనేజీ నీరు వెళ్లి మరో సమస్యకు కారణం అవుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు బాధ్యతగా మెల్లగాల్సిన అధికారులు ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
