ఘనంగా వైఎస్ ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు….

ఘనంగా వైఎస్ ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలు….
కృష్ణలంక విజయవాడ తూర్పు, ఆంధ్ర ప్రభ : వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ప్రియతమ నాయకులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి స్థాపించి 16 వ వసంతం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా యన్.టి.ఆర్. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ,రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, వైసీపీ శ్రేణులతో కలిసి దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ బలోపేతమునుకు కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజా ప్రతినిధులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ హోదాలో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండలస్థాయిలో పదవుల్లో ఉన్న నాయకులు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.
