సమస్యలు పరిష్కరించాలని వినతి…

సమస్యలు పరిష్కరించాలని వినతి…

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని పరకాల మున్సిపల్ చైర్మన్ పావిశెట్టి సునీల్ కుమార్ కు సిపిఎం పట్టణ ప్రధాన కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. రోజు సిపిఎం పరకాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్ కు అందజేశారు. సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పరకాల పట్టణంలోని సిఎస్ఐ స్కూల్ పక్కన పిడుగుబండ వెళ్లే దారిలో వివిధ కులాలకు చెందిన స్మశాన వాటిక ఉంది వెంటనే రోడ్డు, కరెంట్ పోల్స్ స్తంభాలు లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు.

అదేవిధంగా పిడుగు బండ ప్రాంతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని 15 కుటుంబాలు ఉంటున్నారు. వారికి వెంటనే వీధిలైట్లు మరియు రోడ్డు నిర్మాణం వాటర్ పైప్ లైన్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శాంతి కుమార్, చేరాలు, బన్నీ, బోట్ల సునీత, చుక్క మానస మడికొండ రవళి, స్రవంతి సిపిఎం నాయకులు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply