సాఫ్ట్‌బాల్ పోటీల్లో బాలికల జట్టుకు ప్రథమ స్థానం

సాఫ్ట్‌బాల్ పోటీల్లో బాలికల జట్టుకు ప్రథమ స్థానం
– బాలుర జట్టు ద్వితీయ స్థానం
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో నిర్వహించిన 69వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ అండర్–14 బాలబాలికల టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా జట్లు విశేష ప్రతిభ కనబర్చాయి. బాలికల విభాగంలో సెమీఫైనల్లో వరంగల్ జిల్లా జట్టుపై 05–0 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకున్న నిజామాబాద్ జట్టు, ఫైనల్లో మెదక్ జిల్లా జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో 07–05 పరుగుల తేడాతో గెలిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని ట్రోఫీతో పాటు బంగారు పతకాలు అందుకుంది.
బాలుర విభాగంలో సెమీఫైనల్లో మెదక్ జిల్లా జట్టుపై 06–03 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరిన నిజామాబాద్ జట్టు, ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టుతో తలపడింది. నువ్వా–నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో 02–03 పరుగుల తేడాతో ఓటమి పాలై ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకాలు అందుకుంది. ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథులుగా నెల్లికుదురు మండల విద్యాధికారి ఆంగోతు రాందాస్, మహబూబాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

జిల్లా జట్టుకు కోచ్, మేనేజర్లుగా మర్కంటి గంగామోహన్, ఈ. నరేష్, ఎం. రమేష్, అర్చన తదితరులు వ్యవహరించినట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను, కోచ్‌లు, మేనేజర్లను జిల్లా విద్యాశాఖ అధికారి పి. అశోక్ మరియు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి అభినందించారు.
