T Congress | కసరత్తు

T Congress | కసరత్తు
హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి
T Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థి (Rajya Sabha Candidate) ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్‌లో కసరత్తు ముమ్మరమైంది. ఖాళీ కానున్న రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ లోపల విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి. వివిధ వర్గాల నుంచి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో హైకమాండ్ తుది నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో సమావేశమై అభ్యర్థి ఎంపిక, రాజకీయ సమీకరణాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. సామాజిక సమీకరణాలు, రాజకీయ ప్రాధాన్యత, పార్టీ విధేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
