అమరవీరులకు ఘనంగా నివాళ్ళు

అమరవీరులకు ఘనంగా నివాళ్ళు
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని అమరధామంలో మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏకు శంకర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమ విజయం మాదిగ అమరులకు అంకితం – పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ మూడు దశాబ్దాల ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో ఎస్సీ వర్గీకరణ సాధన కోసం జరిగిన అనేక ఉద్యమ ఘట్టాలలో వీరోచితమైన పాత్రను పోషించి జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం తృణప్రాయంగా తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించి నేలరాలిన మాదిగ అమరవీరులకు సామాజిక ఉద్యమ జోహార్లు, కన్నీటి నివాళులు అర్పిస్తున్నామని అన్నారు.
అది తరతరాల జాతిని చీకటి పారదోలుతూ జాతికి వెలుగులు తీసుకొచ్చింది. ఈ వెలుగులు సాధించడం కోసం నడిచిన పోరుబాటలో అనేకమంది బిడ్డలు అసువులు బాసారని, ఈరోజు సాధించిన వర్గీకరణ ఫలాలను భవిష్యత్తు తరాలకు అందిస్తున్నటువంటి మీ త్యాగాల అమరత్వానికి జోహార్లు అర్పిస్తూ జాతి యావత్తు మీ ఆశయాలతో ముందుకు సాగుతూ జాతీయావత్తు మిమ్మల్ని స్మరిస్తూ జీవితాంతం రుణపడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ సంఘాల పరకాల మండల నాయకులు బొచ్చు రవివర్మ, మంద కోర్నెల్ మాదిగ, రాజేష్ గూడెల్లి రాజ్ కుమార్, రాకేష్, రాజు మాదిగలు తదితరులు పాల్గొన్నారు.
