సిమెంటు రహదారి నిర్మాణం పూర్తి..

సిమెంటు రహదారి నిర్మాణం పూర్తి..
ఆంధ్రప్రభ, కృష్ణా బ్యూరో : కృష్ణా జిల్లా నాగాయలంక పంచాయతీ పరిధిలో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారి నుంచి స్థానిక జెడ్పీపాఠశాల మీదుగా తాతయ్య గారి మిల్లు వరకు 593 మీటర్లు పొడవు గల సిమెంటు రహదారి నిర్మాణాన్ని అధికారులు పూర్తి చేశారు. సదరు రహదారి నిర్మాణానికి ఉపాధి నిధులు రూ.50లక్షలు మంజూరు కాగా గతేడాది జూన్ 12న ఎమ్మెల్యే మండలిబుద్ధ ప్రసాద్ అధికారులతో కలసి భూమి పూజను చేశారు. అనంతరం రహదారికి లెవలింగు పనులు చేసి, లేయర్లు వేసి రోలింగు చేయించారు. ఈ నెల ప్రారంభంలో సిమెంటు రహదారి పనులను మొదలు పెట్టి నిర్మాణ పనులను చేసి పూర్తి చేశారు. రహదారికి ఇరువైపులు రబ్బీషు పనులే ఇంకా మిగిలి ఉన్నాయి. దశాబ్దం కాలంగా సదరు జెడ్పీ రోడ్డు గుంతలు పడి గ్రామస్థులకు, వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారింది. అరకిలో మీటరు పైగా పొడవు వున్న ఈ రోడ్డు నిర్మాణం జరగటంతో నాగాయలంక ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకి, స్థానిక నాయకులకు, అధికారులకు వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
