నూతన రేషన్ దుకాణం ప్రారంభం..

నూతన రేషన్ దుకాణం ప్రారంభం..
ఉమా కాలనీలో ప్రజలకు అందుబాటులో..
విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ప్రారంభం
నందిగామ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని 17వ వార్డు ఉమా కాలనీలో నూతన రేషన్ డీలర్ దుకాణాన్ని ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. కొమరగిరి రవితేజ నిర్వహణలో ఏర్పాటైన ఈ రేషన్ దుకాణం స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండల కృష్ణకుమారి, కూటమి నాయకులు పాల్గొని దుకాణాన్ని ప్రారంభించారు. కొత్త రేషన్ షాపు ప్రారంభంతో ఉమా కాలనీ పరిసర ప్రాంతాల ప్రజలకు అవసరమైన సరుకులు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన సరుకులను పారదర్శకంగా అందించేందుకు కట్టుబడి ఉందని, రేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

