సైన్స్‌తోనే మానవ మనుగడ..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లి మండలం లోని బషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సీవీ రామన్‌కు ఘన నివాళి అర్పిస్తూ.. సైన్స్‌ ఫెయిర్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వయం పరిపాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులుగా లక్మ శ్రీ వర్షిత్ మరియు కే గోపాల్,ఆఫీస్ సబార్డినేట్ గా బాధ్యత నిర్వర్తించారు.ఉత్తమ బోధన చేసిన తోపారం వందనకు మొదటి బహుమతి టి.శివ ప్రియకు రెండవ బహుమతి, బి.హర్ష వర్ధనికి మూడోవ బహుమతు లను ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం అందజేశారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని,అన్ని వృత్తుల కెల్లా అతి ముఖ్యమైన వృత్తి ఉపాద్యాయ వృత్తి అని,విద్యార్థులు వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు.భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని ఇష్టంగా స్వీకరిస్తామని విద్యార్థులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply