వినియోగదారుల ముంగిటకే విద్యుత్ సేవలు..

వినియోగదారుల ముంగిటకే విద్యుత్ సేవలు..
విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సాప్ చాట్
విద్యుత్ శాఖ నూతన ఒరవడి
ఎన్సీడీసియల్ ఎస్ఈ : పి. వి. రాజేశ్వర్ రావు వెల్లడి
నిజామాబాద్, ఆంధ్ర ప్రభః విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ నూతన ఒరవడిని సృష్టించింది. వినియోగదారుల ముంగిటకే విద్యుత్ సేవలను తీసుకోవచ్చింది. విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ అత్యాధునిక సాంకే తికతను వినియోగ దారు ల ముంగిట్లోకి తెచ్చిందని నిజామాబాద్ సర్కిల్ సూ పరింటెండింగ్ ఇంజనీర్ పి. వి. రాజేశ్వర్ రావు బుధ వారం ఒక ప్రకటనలో వెల్ల డించారు.వినియోగదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవస రం లేకుండా, తమ మొబై ల్ నుండే వాట్సాప్ చాట్ బాట్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఫిర్యాదు నమోదు చేసే విధానం
వినియోగదారులు తమ మొబైల్ నుండి 790162 8348 నంబరుకు వాట్సా ప్ లో హాయ్ అని మెసేజ్ పంపాలి.వెంటనే ‘హాయ్.. ఎన్పీడీసీఎల్ కాల్ సెంటర్ కు స్వాగతం’ అనే సందే శంతో పాటు రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అనే ఆప్షన్స్ వస్తాయి. రిజిస్టర్ కంప్లైంట్ ను ఎంచుకు న్నా క మీ విద్యుత్ కనెక్షన్ సర్వీస్ నెంబర్, వివరాలు లేకుండా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.సర్వీస్ నంబర్ నమోదు చేయ గానే వినియో గదారుని వివరాలు కనిపిస్తాయి. వాటిని నిర్ధారించాక (ఒకే చేశాక), మెనూలో సమస్య రకాన్ని ఎంచుకోవాలి.
త్వరితగతిన పరిష్కారం, పారదర్శ కత
ఫిర్యాదు నమోదు కాగానే ఒక కంప్లెంట్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ సమా చారం వెంటనే సంబంధిత అధికారికి నివేదించబ డు తుంది. ఫిర్యాదు పరిష్కా రమయ్యాక వినియోగదా రునికి సందేశంతో పాటు ఐ విఆర్ఎస్ రా కాల్ వస్తుందని ఎస్ఈ వివరిం చారు. ఒకవేళ పరిష్కా రంపై సంతృప్తి చెందక పోతే, తిరిగి ఫిర్యాదును రీ-ఓపెన్ చేసే అవకాశం లేదా పీడ్ బ్యాక్ ఇచ్చే సౌకర్యం కూడా కల్పిం చామన్నారు.
వినియోగదారులు ఎన్పి డిసిఎల్ అధికారిక వెబ్ సైట్ www.tgnpdcl.com లోని వాట్సాప్ ఐకాన్ క్లిక్ చేసి కూడా ఈ సేవలు పొందవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబ ర్ 1912 ను కూడా సంప్ర దించవచ్చని ఆయన కోరా రు. సాంకేతికతను అంది పుచ్చుకుని మెరుగైన సేవలు అందించడమే సంస్థ లక్ష్యమని ఎస్ఈ స్పష్టం చేశారు.
