ఇంటింటికి తిరిగి వినూత్న విజ్ఞప్తి..

ఇంటింటికి తిరిగి వినూత్న విజ్ఞప్తి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని తిప్రాస్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి నర్సింహ బుధవారం గ్రామంలో ఇంటింటికి తిరిగిబొట్టుపెట్టి పువ్వు అందజేస్తూ బహిరంగ మలమూత్ర విసర్జన చేయవద్దంటూ వినూత్నంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ విజయలక్ష్మి నరసింహ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జనతో రోగాలు వస్తాయని దోమలు ఈగల బెడద తీవ్రమవుతుందని అన్నారు. ప్రభుత్వం మహిళల ఆత్మగౌరాన్ని కాపాడేందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిందని బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలకాలనికోరారు. నారాయణపేట – మక్తల్ ఆర్ అండ్ బి ప్రధాన రహదారి చుట్టుపక్కల మలమూత్ర విసర్జన చేయడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు దుర్గంధ భరిత వాసన భరించలేక పోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకొని బహిరంగ మాలమూత్ర విసర్జనకు స్వస్తిపాలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, వార్డు సభ్యులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
